వీడియో చూస్తూ డ్రైవింగ్‌.. పోలీసులకి అన‌సూయ ట్వీట్

ఇటు బుల్లితెర‌పై రాణిస్తూ అటు వెండితెర‌పై అద్భుత‌మైన పాత్ర‌లు పోషిస్తున్న అన‌సూయ తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ చేసింది. నిన్న సాయంత్రం త‌ను బంజారాహిల్స్ రోడ్ నెంబ‌ర్ 2 దారిలో వెళుతుండ‌గా, ప‌క్క‌న కారు డ్రైవ‌ర్ చెవిలో ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకొని ఎదురుగా ఉన్న మొబైల్‌లో వీడియో చూస్తూ కారు డ్రైవ్ చేస్తున్నాడు. ఈ స‌న్నివేశాల‌ని అన‌సూయ త‌న మొబైల్ కెమెరాలో బంధించి హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీస్‌కి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. డియ‌ర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌.. ఇలాంటి సంఘ‌ట‌న‌లు నన్ను బ‌య‌పెట్టిస్తున్నాయి. ఇంత‌క ముందు వేరే వారి త‌ప్పిదం వ‌ల‌న నేను ప్ర‌మాదానికి గుర‌య్యాను. ద‌య చేసి ఇలాంటి నిర్ల‌క్ష్య‌పు డ్రైవ‌ర్స్‌ని వ‌దలొద్దు.రోడ్స్ పై త‌మ‌కిష్ట‌మోచ్చిన‌ట్టు డ్రైవ్ చేసే వారికి ఇత‌రుల ప్రాణాలంటే లెక్క‌లేదా అని అన‌సూయ త‌న ట్వీట్‌లో తెలిపింది. గ‌త సంవ‌త్సరం మేలో అన‌సూయ ఓ ఈవెంట్‌కి వెళ్లివ‌స్తుండ‌గా, పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. పెనుకొండ మండ‌లం గుంటూరు స‌మీపంలో ఆమె ప్ర‌యాణిస్తున్న కారుని ఎద‌రుగా వ‌స్తున్న కారు ఢీకొన‌డంతో త‌ల‌కి బ‌ల‌మైన గాయ‌మైంది. ఎయిర్ బెలూన్ వ‌ల‌న‌ ఈ ప్రమాదంలో అంద‌రు సుర‌క్షితంగా బయ‌ట‌ప‌డ్డారు.

× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు