అమీ నిర్ణ‌యంతో షాక్ లో అభిమానులు ..!

కెన‌డియ‌న్ బ్యూటీ అమీ జాక్స‌న్ అభిమానుల‌కి షాకిచ్చే నిర్ణ‌యం తీసుకుంద‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇటీవ‌ల శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 2.0 చిత్రంలో లేడీ రోబోగా న‌టించింది అమీ. ఈ అమ్మ‌డికి సంబంధించి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి కూడా. ఇందులో అమీని చూసిన అభిమానులు మురిసిపోయారు. 2.0 చిత్రం కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రోవైపు అమీ జాక్స‌న్ కూడా 2.0 చిత్ర రీలీజ్ కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తుంది. ఈ మూవీ విడుద‌లైతే త‌న‌కి మరిన్ని సినిమాల‌లో ఆఫ‌ర్స్ వ‌స్తాయ‌ని భావిస్తుంద‌ట‌. కాని మూవీ రిలీజ్.. రోజు రోజుకి వెన‌క్కి పోతుండ‌డంతో అమీ జాక్స‌న్ అభిమానుల‌కి షాక్ ఇచ్చే నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలుస్తుంది. ఇక ఇండియ‌న్ సినిమాల‌కి గుడ్ బై చెప్పి, ఆఫ్రిక‌న్ దేశంలోని మొరాకోలో సెటిల్ కావాల‌ని డిసైడ్ అయింద‌ట‌. మ‌రి ఈ వార్త‌ క‌నుక నిజ‌మైతే అభిమానుల గుండెలు గాయ‌ప‌డ‌టం గ్యారెంటీ. కెనడాకు చెందిన అమీ జాక్స‌న్‌ మదరాసుపట్టణం చిత్రంతో కోలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. అక్క‌డి నుంచి టాలీవుడ్, బాలీవుడ్‌కు వెళ్లిన ఎమీజాక్సన్‌ తమిళంలోనే ఎక్కువ చిత్రాలను చేసింది. దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో రెండు సార్లు సినిమా చేసే చాన్స్ కొట్టేసిన అతి కొద్దిమంది హీరోయిన్లలో అమీ జాక్స‌న్ ఒక‌రు.

Related Stories: