జేసీబీ వాహ‌నాన్ని ఢీకొన్న రైలు

మధురై: తమిళనాడులో అమృతా ఎక్స్‌ప్రెస్ రైలు .. ఓ జేసీబీని ఢీకొట్టింది. దిండిగల్ జిల్లాలోని పలని, చతిరపాటి రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న లెవల్ క్రాసింగ్ వద్ద ఈ ఘటన జరిగింది. జేసీబీ వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఇద్దర్నీ పలనిలోని ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. లెవల్ క్రాసింగ్ వద్ద విజిబులిటీ సరిగానే ఉన్నా.. జేసీబీ డ్రైవర్ మాత్రం నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపినట్లు రైల్వే అధికారులు తెలిపారు. తిరువనంతపురం నుంచి మధురై వెళ్తున్న రైలు ఎర్త్‌మూవర్‌ను ఢీకొట్టింది. రైలు ఢీకొట్టడంతో జేసీబీ కొన్ని మీటర్ల దూరం ఎగిరి పడింది. అయితే రైలు ఇంజన్‌తో పాటు సీటింగ్ కమ్ లగేజీ కోచ్, మరో రెండవ తరగతి కోచ్ ఈ ప్రమాదంలో స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటన తర్వాత ఓ గంట సేపు రైలును ఆపేశారు.

Related Stories: