శిఖా శర్మ స్థానంలో అమితాబ్ చౌదరీ

-యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా నియామకం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకైన యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా అమితాబ్ చౌదరీ నియమితులయ్యారు. జనవరి 1, 2019 నుంచి మూడేండ్లపాటు అంటే డిసెంబర్ 2021 చివరి నాటికి ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ, సీఈవోగా విధులు నిర్వహిస్తున్న చౌదరీ.. శిఖా శర్మ స్థానాన్ని భర్తి చేయనున్నారు. శర్మ డిసెంబర్ 31, 2018న పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. శనివారం బ్యాంకు బోర్డు డైరెక్టర్లు సమావేశమై ఈ నియామకానికి రిజర్వు బ్యాంక్ అనుమతించిన విషయాన్ని బీఎస్‌ఈకి సమాచారం అందించింది. ఈ సందర్భంగా చౌదరీ మాట్లాడుతూ..అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ అధిపతిగా నియామకానికి అనుమతినిచ్చిన ఆర్బీఐ, యాక్సిస్ బ్యాంక్ బోర్డులకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు చెప్పారు.

Related Stories: