బిగ్ బీ లెట‌ర్‌తో ఆనందంలో తాప్సీ, విక్కీ కౌశ‌ల్‌

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఏడుప‌దుల వ‌య‌స్సులోను ఎంతో ఎనర్జిటిక్‌గా సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోను ప‌లు చిత్రాల‌లో ఆయ‌న న‌టిస్తున్నాడు. చిరు 151వ చిత్రం సైరాలో రాజ‌గురువు పాత్ర పోషించిన అమితాబ్.. ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న అర‌వింద స‌మేత‌లో కూడా న‌టిస్తున్నాడ‌ని స‌మాచారం. బాలీవుడ్‌లో అమితాబ్ నటించిన థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం విడుద‌ల కావ‌ల‌సి ఉంది. అయితే మంచి టాలెంట్ ఉన్న న‌టీన‌టుల‌కి స్వ‌ద‌స్తూరితో లెట‌ర్స్ రాసి వారిని అభినందించ‌డం బిగ్‌బీకి అల‌వాటు అన్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో ప‌లువురి స్టార్స్‌ని అభినందిస్తూ లెట‌ర్ రాసిన అమితాబ్ ఈ సారి త‌న త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్ న‌టించిన ‘మన్‌మర్జాయన్‌’చిత్రంలో న‌టించిన తాప్సీ, విక్కీ కౌశ‌ల్‌కి లేఖ రాసారు. అంతేకాదు వారికి బొకేలు కూడా పంపారు. ఊహించ‌ని విధంగా అమితాబ్ నుండి బొకేతో కూడిన లెట‌ర్ రావ‌డంతో చాలా ఆనందంగా ఫీలై సోష‌ల్ మీడియా ద్వారా సంతోషాన్ని తెలియ‌జేశారు. అభిషేక్, తాప్సీ, విక్కీ విశాల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ‘మన్‌మర్జాయన్‌’ చిత్రం అనురాగ్ క‌శ్య‌ప్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 14న విడుద‌ల చేయ‌నున్నారు.

Related Stories: