కోలీవుడ్ ఆరంగేట్రం చేయ‌బోతున్న మెగా స్టార్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ హిందీ సినీ పరిశ్ర‌మ‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాలు చేశారు. కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. ప్ర‌స్తుతం స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తున్నారు. థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రంలో ముఖ్య పాత్ర చేశారు అమితాబ్. ఈ సినిమా న‌వంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. ఇక తెలుగులో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న సైరా చిత్రంలో రాజ గురువు పాత్ర‌ పోషిస్తున్నారు. ఇక ఇన్నాళ్ళ‌కి కోలీవుడ్ ఆరంగేట్రం చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని స్పైడ‌ర్ విల‌న్ ఎస్‌జే సూర్య త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. ఉయ్య‌రంద మ‌నిత‌న్ అనే త‌మిళ చిత్రంలో సూర్య ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా, ఈ సినిమాలో ముఖ్య పాత్ర కోసం బిగ్‌బీని సంప్ర‌దించారు చిత్ర యూనిట్‌. క‌థ న‌చ్చ‌డంతో వెంట‌నే ఈ ప్రాజెక్ట్‌ని ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. గురువారం రోజు త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ చేతుల మీదుగా చిత్ర పోస్ట‌ర్ విడుద‌లైంది. నా స్నేహితుడు అమితాబ్ బ‌చ్చ‌న్ త‌మిళ ప‌రిశ్ర‌మకి ఆరంగేట్రం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. అంతేకాక ఎస్‌జే సూర్య ఈ చిత్రంతో హిందీ ఫిలిం ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్నందుకు చాలా సంతోషం. అమితాబ్, సూర్య‌ల‌కి నా శుభాకాంక్ష‌లు అని ర‌జ‌నీ వీడియోలో తెలిపారు. ఈ మూవీ త‌మిళం, హిందీ భాష‌ల‌లో ఒకే సారి విడుద‌ల కానుంది.
× RELATED సీఎం సభాస్థలిని పరిశీలించిన జీవన్‌రెడ్డి, కేఆర్ సురేశ్‌రెడ్డి