అర‌వింద స‌మేత ఆడియో వేడుకకి గెస్ట్‌గా మెగాస్టార్‌..!

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మోస్ట్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ అర‌వింద స‌మేత‌. జూనియ‌ర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. అక్టోబ‌ర్ 11న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని చూస్తుండ‌గా, సెప్టెంబ‌ర్ 20న హైద‌రాబాద్‌లోని నోవాటెల్‌లో ఆడియో వేడుక జ‌ర‌పాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ఈ కార్య‌క్ర‌మానికి అతిధిగా ఎవ‌రు హాజ‌ర‌వుతార‌నే దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. బాల‌య్య‌, మ‌హేష్ బాబుల‌లో ఒక‌రు చీఫ్ గెస్ట్‌గా హాజ‌రు అవుతార‌ని నిన్న‌టి వ‌ర‌కు వార్త‌లు రాగా, తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఊహించ‌ని అతిధిగా అర‌వింద స‌మేత ఆడియో వేడుక కార్య‌క్ర‌మానికి హాజరు కానున్నాడ‌ని చెబుతున్నారు. అమితాబ్ చిత్రంలో ముఖ్య పాత్ర కూడా పోషించాడ‌ని, సినిమా రిలీజ్ వర‌కు ఈ విష‌యాన్ని సీక్రెట్‌గా ఉంచాల‌ని టీం భావిస్తుంద‌ట‌. మరి ఇందులో నిజమెంతో తెలియ‌క అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సిరివెన్నెల , రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.

Related Stories: