రాజస్థాన్ ఎన్నికలు 2019కి ట్రైలర్

- లోక్‌సభ ఎన్నికలకు రాచబాట వేద్దాం - కార్యకర్తల సమావేశంలో అమిత్ షా పిలుపు
జైపూర్: వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ట్రైలర్‌లాంటివని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. రాజస్థాన్‌లో బీజేపీని ఓడించే దమ్ము ఎవరికీ లేదని, పార్టీ ఘన విజయం సాధించి తిరిగి అధికారంలోకి రావడానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక్కరోజు పర్యటన నిమిత్తం మంగళవారం జైపూర్‌కు వచ్చిన ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయే మళ్లీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధిస్తామని, తద్వారా 50 ఏండ్లపాటు కేంద్రంలో మళ్లీ బీజేపీనే అధికారం ఉండేలా రాచమార్గం నిర్మిస్తామని తెలిపారు. బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలు జతకట్టాలని ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ప్రధాని పీఠం గురించి కలగంటున్న రాహుల్.. లోక్‌సభ ఫలితాలతో కండ్లు తెరుస్తాడని ఎద్దేవా చేశారు.

Related Stories: