తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా ఆటా వేడుకలు

అమెరికా : తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా ఆటా తెలంగాణ వేడుకలకు ఏర్పాట్లు చేశామని వైస్ కన్వీనర్ నాగేందర్ ఐత స్పష్టం చేశారు. ఈ నెల 8 నుంచి 10 వరకు జరగబోయే ఆటా వేడుకలకు సర్వం సిద్ధం చేశామని తెలిపారు. అణువణువునా తెలంగాణ కనిపించబోతుందన్నారు. బతుకమ్మ, బోనాలు, పల్లె పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయని చెప్పారు. బంగారు తెలంగాణ, మిషన్ తెలంగాణతో పాటు ఎన్‌ఆర్‌ఐ సమస్యలపై సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణకు సంబంధించి పలు స్టాళ్లను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో అంతర్భాగమైన జీవన విధానం, పోరాట పటిమ, మన మహనీయులు, భౌగోళిక, చరిత్రాక అంశాలను తెలియజేసేలా కార్యక్రమాలు ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణ సాంస్కృతిక వైభవం దేశ దేశాల్లో కొనసాగాలనేదే తమ ఆశ అని నాగేందర్ స్పష్టం చేశారు.

Related Stories: