నన్ను తొలగిస్తే.. అమెరికా మార్కెట్లు కుప్పకూలుతాయి!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. తనపై ఉన్న సెక్స్ స్కాండల్‌ను అడ్డం పెట్టుకొని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని చూస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుందని గురువారం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ హెచ్చరించారు. నన్ను ఎప్పుడైనా అభిశంసించాలని అనుకుంటే అమెరికా మార్కెట్ మొత్తం కుప్పకూలుతుంది. అందరూ చిక్కుల్లో పడతారు. మీరు ఊహించని ఫలితాలు ఉంటాయి అని ట్రంప్ ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్ అనే కార్యక్రమంలో ట్రంప్ అనడం గమనార్హం. అయినా ఎన్నో గొప్ప పనులు చేసిన ఓ వ్యక్తిని మీరు ఎలా అభిశంసించాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. అమెరికా ప్రచార ఆర్థిక చట్టాలను ఉల్లంఘించేలా ట్రంప్ వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన మాజీ లాయర్ మైకేల్ కోహెన్ మాన్‌హటన్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ సూచన మేరకే ఓ పోర్న్ స్టార్, మరో మోడల్‌కు తాను డబ్బులు ఇచ్చినట్లు కోర్టులో కోహెన్ చెప్పారు.

× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?