వామ్మో.. అమెరికా అగ్రరాజ్యం కాదట

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్వచనాలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయి. ఊరందరిదీ ఒకదారి అంటే ఉలిపికట్టెది ఒకదారి అన్న చందంగా ఉంటాయి ఆయన మాటలు. మనమంతా అమెరికా సంపన్న రాష్ట్రమని, అగ్రరాజ్యమని అనుకుంటాం. అంటుంటాం. కానీ అమెరికాయే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని అంటూ తన దేశం స్థాయిని కొంత తగ్గించారు. పట్టిపట్టి పంగనామాలు పెడితే పక్కకుపోయి గోక్కున్నట్టుంది. మాదీ అభివృద్ధి చెందుతున్న దేశం.. మేమూ ఎదుగుతున్నాం అన్నారు. ఇదంతా ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశాలమంటూ భారత్, చైనా సబ్సిడీలను గుంజుతున్నాయట. వీటిని ఇకనుంచి నిలిపివేస్తున్నాం.. నిలిపివేశాం అని స్పష్టం చేశారు. పనిలోపనిగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) మీద మండిపడ్డారు. చైనా గొప్ప ఆర్థికశక్తిగా ఎదగడానికి డబ్ల్యూటీవో కారణమని సిద్ధాంతీకరించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు అనే కారణంగా భారత్, చైనా తదితర దేశాలకు మెరికా సబ్సిడీలు ఇస్తుంటే అవి ఎదుగుతున్నాయని, దీనివల్ల అమెరికాకు ఏమీ ఉపయోగం లేదని ట్రంప్ అన్నారు.

Related Stories: