అమీర్‌పేట-ఎల్బీనగర్ మెట్రో ఈ నెల 24న ప్రారంభం

హైదరాబాద్: ఈ నెల 24న అమీర్‌పేట-ఎల్బీనగర్ మెట్రో రైల్ లైన్ ప్రారంభం కానుంది. ఈ నెల 24న మధ్యాహ్నం 12.15 గంటలకు.. అమీర్‌పేట-ఎల్బీనగర్ మెట్రో లైన్‌ను గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా మంత్రి కేటీఆర్ రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఆహ్వానించారు. మంత్రి కేటీఆర్‌తో పాటు సీఎస్ ఎస్‌కే జోషి, ఎంఏఅండ్‌యూడీ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

Related Stories: