కాళ్లు, చేతులు విరిగాయి.. షాక్‌తోనే అతడు మృతి!

న్యూఢిల్లీ: హర్యానాలోని అల్వార్‌లో గోసంరక్షకుల దాడిలో మృతి చెందిన రక్బర్ ఖాన్ పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చింది. ఓ బలమైన ఆయుధంతో కొట్టడం వల్ల ఒంటిపై అయిన తీవ్ర గాయాలు, షాక్ కారణంగా అతడు మృతి చెందినట్లు నివేదిక స్పష్టంచేసింది. అతని ఒంటిపై మొత్తం 12 గాయాలయ్యాయి. కాళ్లు, చేతులు విరిగినట్లు పోస్ట్‌మార్టమ్‌లో తేలింది. రెండు ఆవులు, వాటి దూడలను రక్బర్ ఖాన్ తీసుకెళ్తున్న సమయంలో ఏడుగురు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. అయితే దాడి జరిగిన మూడు గంటల తర్వాత అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అప్పటికే అతను మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. రక్బర్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం జరిగిందని పోలీసులు కూడా అంగీకరించారు. దీంతో ఏఎస్సై మోహన్ సింగ్‌ను ఇప్పటికే సస్పెండ్ చేశారు. ముగ్గురు కానిస్టేబుళ్లను ట్రాన్స్‌ఫర్ చేశారు. నలుగురు సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటుచేశారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వాళ్లు ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు.

× RELATED సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ వివరాలు