బ‌న్నీ త‌దుప‌రి చిత్రంపై వ‌చ్చిన క్లారిటీ..!

ఇటీవ‌ల నా పేరు సూర్య‌.. నా ఇల్లు ఇండియా అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బ‌న్నీ, త్వ‌ర‌లో ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొంద‌నున్న ఈ సినిమాకి సంబంధించి ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. బారీ బ‌డ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ ప్రాజెక్ట్‌ని రూపొందించాల‌ని టీం భావిస్తుంది. సినిమాకి యాక్ష‌న్ సీన్స్ కీల‌కం కాబ‌ట్టి హాలీవుడ్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌ని ఈ ప్రాజెక్ట్‌కి ఎంపిక చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక సంగీత ద‌ర్శ‌కుడిగా ఏఆర్ రెహ్మాన్ అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఆయ‌నతో సంప్ర‌దింపులు జరిపి ఒప్పించేలా ప్ర‌య‌త్నిస్తున్నారని ఇన్‌సైడ్ టాక్. రెహ‌మాన్ ఈ ప్రాజెక్ట్‌కి క‌నుక గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే మూవీ స‌గం విజ‌యం సాధించిన‌ట్టేన‌ని అంటున్నారు. గ‌తంలో బ‌న్నీ సినిమాని తెర‌కెక్కించే ద‌ర్శ‌కుల లిస్ట్‌లో ప‌లువురి పేర్లు ప్ర‌స్తావ‌న‌కి రాగా, విక్ర‌మ్ కుమార్ క‌థ‌కి ఇంప్రెస్ అయిన బ‌న్నీ ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలోనే త‌దుపరి చిత్రం చేయ‌నున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే చిత్రంలో న‌టించే క‌థానాయిక‌ల వివ‌రాలు కూడా వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

× RELATED ఒంటిపై కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్య