శ్రీలంకలో అన్ని దేశీయ విమానయాన సేవలు నిలిపివేత

కొలంబో: బాంబు పేలుళ్ల నేపథ్యంలో దేశంలోని అన్ని జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలకు తీవ్ర ముప్పు హెచ్చరికలను జారీ చేసినట్లు ఆ దేశ విమానయానశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. పౌర విమానయానశాఖ డైరెక్టర్ జనరల్ హెచ్.ఎం.సి. నిమల్‌సిరి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ.. దేశీయ విమాన సర్వీసులను నిలిపివేసినట్లు తెలిపారు. బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో అదనపు భద్రతా చర్యలను చేపట్టినట్లు చెప్పారు. సాధారణ సమయానికంటే నాలుగు గంటలు ముందుగానే ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకోవాల్సిందిగా పేర్కొన్నారు.

Related Stories: