ఆ హీరోయిన్ నిశ్చితార్ధం ర‌ద్దు అయింద‌నేది అవాస్త‌వం

ఛలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ రష్మిక మందాన‌. తాజాగా గీత గోవిందం అనే చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించింది. అయితే ఈ అమ్మ‌డు ఇటీవల త‌న నిశ్చితార్దం విష‌యంతో వార్త‌ల‌లోకి ఎక్కింది. కన్నడ నటుడు, డైరెక్టర్ రక్షిత్ శెట్టితో ర‌ష్మిక ప్రేమలో పడిన విషయం తెలిసిందే. కిరిక్ పార్టీ మూవీ స‌మ‌యంలో వీరిద్ద‌రి మ‌ధ్య ఏర్పడిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. త్వ‌ర‌లోనే నిశ్చితార్దం కూడా చేసుకోవాల‌ని భావించారు. అయితే వీరి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌లు విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నార‌ని పుకార్లు షికారు చేశాయి. కెరీర్‌లో బాగా నిల‌దొక్కుకున్నాకే నిశ్చితార్దం, పెళ్ళి చేసుకోవాల‌ని ఈ అమ్మ‌డు భావిస్తున్న‌ట్టు కూడా ఇండ‌స్ట్రీలో ఒక టాక్ న‌డిచింది.

ర‌ష్మిక నిశ్చితార్ధంకి సంబంధించిన వార్తలపై రష్మిక ప్రతినిధి స్పందించారు. ఆమె నిశ్చితార్థం రద్దయినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయ‌న ఓ ఆంగ్ల పత్రికకు తెలిపారు. ‘ఇటీవలే ఇద్దరు (రష్మిక, రక్షిత్‌) కలిసి బెంగళూరులో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఓ సినిమా ప్రీమియర్‌కు కూడా వెళ్లారు. నిశ్చితార్థం రద్దు అయ్యిందనే ప్రచారంలో నిజం లేదు. వారిద్దరికీ ఒకరిపై మరొకరికి ఎంతో ప్రేమ ఉంది. ఇప్పుడూ అంతే ఇష్టంతో ఉన్నారు’ అని వివరించారు. ర‌ష్మిక న‌టించిన తాజా చిత్రం గీత గోవిందం ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.

× RELATED ఒంటిపై కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్య