చివరిదశలో రైతు సమన్వయ సమితుల ఏర్పాటు

-మూడు జిల్లాలు మినహా అన్నింటా పూర్తి -త్వరలో సీఎం చెంతకు జిల్లాల జాబితా -రెండు మూడు రోజుల్లో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వ్యవసాయాన్ని వ్యవస్థీకృత రంగంగా మార్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన రైతు సమన్వయ సమితుల ఏర్పాటు చివరిదశకు చేరింది. ఇప్పటికే గ్రామ, మండలస్థాయి కమిటీల నియామకాలు పూర్తయ్యాయి. జిల్లాస్థాయి రైతు సమన్వయ సమితుల ఏర్పాటు పూర్తికావొచ్చింది. ఏర్పాటుకాని జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ఆయా జిల్లాల్లో సమితుల ఏర్పాట్లు పూర్తి కానున్నాయి. పూర్తికాగానే రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. వ్యవసాయశాఖకు చేరిన జిల్లా రైతు సమన్వయ సమితుల జాబితాను పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్ కార్పొరేషన్ ఏర్పాటుతోపాటు చైర్మన్ నియామకంపై నిర్ణయం తీసుకోనున్నారు. 42 మంది సభ్యులతో కార్పొరేషన్ ఉండబోతున్నది. దీనిలో జిల్లాల రైతు సమన్వయ సమితిసభ్యులతోపాటు వ్యవసాయరంగంలో నిపుణులు, శాస్త్రవేత్తలు, అధికారులు, మంత్రులకు చోటుకల్పించే అవకాశం ఉన్నది.
× RELATED ఎర్రవల్లిలో వేదఘోష