24ఏళ్ల రికార్డు బ్రేక్‌.. వ‌రుస‌గా అత్య‌ధిక టెస్టులు ఆడి ప్ర‌పంచ రికార్డు

లండన్: ఇంగ్లాండ్ సీనియర్ క్రికెటర్ అలిస్టర్ కుక్ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఆతిథ్య ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య శుక్రవారం రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. సుధీర్ఘకాలంగా ఇంగ్లాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కుక్ కెరీర్‌లో వరుసగా 154వ(మొత్తంగా 156వది) టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. ఒక టీమ్ తరఫున టెస్టుల్లో వరుసగా అత్యధిక మ్యాచ్‌లాడిన రికార్డు ఇప్పటి వరకు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అలెన్ బోర్డర్(మొత్తంగా ఆడినవి128) వరుసగా 107 మ్యాచ్‌లు ఆడి కొన్నేళ్ల పాటు అగ్రస్థానంలో కొనసాగాడు. 24ఏళ్ల పాటు ఈ రికార్డును ఎవ‌రూ అందుకోలేక‌పోయారు. తాజాగా కుక్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. బోర్డర్ 1979 మార్చి 10 నుంచి 1994 మార్చి 25 మధ్య ఒక్క టెస్టు మ్యాచ్ కూడా వదలకుండా కొన్నేళ్లపాటు ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం విశేషం. తాజాగా కుక్ అతి తక్కువ కాలంలోనే ఈ మైలురాయి అందుకున్నాడు. 2006 మార్చి 1న అరంగేట్రం చేసిన కుక్.. మూడో టెస్టు ఆడటానికి ముందు కేవలం ఒక్క మ్యాచ్‌కే దూరమయ్యాడు. అప్పటి నుంచి ఒక్కటి కూడా మిస్ కాకుండా వరుసగా టెస్టులు ఆడుతూ వచ్చాడు. భారత్ నుంచి మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ వరుసగా 93 టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు.

Related Stories: