అలిస్ట‌ర్ కుక్ సెంచ‌రీ

రాజ్‌కోట్ : ఇంగ్లండ్ క్రికెట‌ర్ అలిస్ట‌ర్ కుక్ రెచ్చిపోయాడు. రాజ్‌కోట్‌లో భార‌త్‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కుక్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. టెస్టుల్లో ఇది కుక్‌కు 30వ సెంచ‌రీ కావ‌డం విశేషం. ఇంగ్లండ్ త‌న రెండ‌వ ఇన్నింగ్స్‌లో అయిదవ రోజు భోజన విరామ సమయానికి 65 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల‌ న‌ష్టానికి 211 ర‌న్స్ చేసింది. కుక్ 106, స్టోక్స్ ఆరు ర‌న్స్‌తో అజేయంగా బ్యాటింగ్ చేస్తున్నారు. భార‌త్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో 488 ర‌న్స్‌కు ఆలౌటైంది. ఇవాళే ఆఖ‌రి రోజు కావ‌డంతో టెస్ట్ డ్రా దిశ‌గా వెళ్తోన్న‌ట్లు క‌నిపిస్తోంది.ఇప్పటి వరకు ఈ టెస్ట్ లో ఇంగ్లండ్ 260 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.

Related Stories: