టెస్ట్ కెప్టెన్సీకి అలిస్ట‌ర్‌ కుక్ గుడ్‌బై

లండన్: టెస్ట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు ఇంగ్లండ్ క్రికెట‌ర్‌ అలిస్ట‌ర్ కుక్‌. ఇంగ్లండ్ త‌రపున 59 మ్యాచ్‌ల‌కు కుక్ సార‌ధ్య బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు. 2012లో అత‌ను కెప్టెన్సీ స్వీక‌రించాడు. 2013, 2015 సంవ‌త్స‌రాల్లో యాషెస్ సిరీస్ గెల‌వ‌డంలో కుక్ కీల‌క‌పాత్ర పోషించాడు. అయితే గ‌త ఏడాది భార‌త్‌తో జ‌రిగిన టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ 4-0 తేడాతో ఓట‌మిపాలైంది. దాంతో కుక్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. కెప్టెన్సీని వ‌దులుకోవ‌డం క‌ఠిన‌మైన నిర్ణ‌య‌మ‌ని, కానీ స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకుంటున్నాన‌ని చెప్పాడు. ఇంగ్లండ్ టీమ్ త‌ర‌పున టెస్ట్ ప్లేయ‌ర్‌గా కెరీర్‌ను కొన‌సాగిస్తాన‌న్నాడు. ఇంగ్లండ్ తరపున టెస్టు క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ కుక్ రికార్డు నెలకొల్పాడు. అత‌ను ఇప్ప‌టివ‌ర‌కు టెస్టుల్లో 11 వేల 57 ర‌న్స్ చేశాడు. కుక్ మొత్తం 140 టెస్టులు ఆడాడు. అందులో 30 సెంచ‌రీలు ఉన్నాయి.
× RELATED లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తాం : కేఏ పాల్