నీళ్లిచ్చిన కేసీఆర్‌కే ఆలంపూర్ ఓటేయాలి: హరీశ్‌రావు

జోగులాంబ గద్వాల: నీళ్లిచ్చిన సీఎం కేసీఆర్‌కే అలంపూర్ ఓటు వేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచార కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ జితేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి అబ్రహం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రికార్డు టైంలో భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు. తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ఆపాలని చంద్రబాబు లేఖ రాసినట్లు తెలిపారు. 8 నెలల్లో తుమ్మిళ్ల ప్రాజెక్టు పూర్తి చేసి అలంపూర్‌కు నీళ్లిస్తామన్నారు. నీళ్లిచ్చిన కేసీఆర్‌కే అలంపూర్ ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ మనకు వచ్చిన నీళ్లను పోగొట్టింది. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆలంపూర్ ప్రజలకు కన్నీరే మిగిలింది. నీళ్లిచ్చిన కేసీఆర్‌ను గెలిపించండి.. కన్నీళ్లిచ్చిన కాంగ్రెస్‌ను ఓడించండని మంత్రి పిలుపునిచ్చారు.

Related Stories: