థియేటర్లలో పదార్థాలపై ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేయొద్దు

హైదరాబాద్: సినిమా థియేటర్లలో పదార్థాలపై ఎమ్మార్పీ కంటే అధికంగా వసూలు చేయరాదని రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్‌ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ల యజమానులతో అకున్ సబర్వాల్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో అకున్ సబర్వాల్ మాట్లాడుతూ..ఎమ్మార్పీ కంటే అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి పదార్థం బరువును స్పష్టంగా ప్రదర్శించాలి. కొనుగోలు చేసే ప్రతి పదార్థానికి బిల్లు తప్పనిసరి. ఈ నెల 24 వరకు ధర, పరిమాణానికి సంబంధించిన స్టిక్కర్లు, అతికించుకోవచ్చన్నారు. సెప్టెంబర్ 1నుంచి పదార్థాలపై ఖచ్చితమైన ధర ముద్రించాలని యజమానులకు నిర్దేశించారు.

Related Stories: