ఆగస్టు 1 నుంచి గరిష్ఠ చిల్లర ధరల అమలు తప్పనిసరి: అకున్ సబర్వాల్

హైదరాబాద్: థియేటర్ల యాజమానులతో తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ ఆదివారం భేటీ అయ్యారు. ఆగస్టు 1 నుంచి గరిష్ఠ చిల్లర ధరలు అమలు తప్పనిసరి అని సబర్వాల్ సూచించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విక్రయ బిల్లుల విషయమై అకున్ సబర్వాల్‌కు థియేటర్ల యాజమానులు విజ్ఞప్తి చేశారు. విరామంలో సమయాభావం వల్ల బిల్లు ఇవ్వటం సాధ్యంకాదని యాజమానులు వివరించారు. వివిధ కంపెనీల నీళ్ల బాటిళ్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. సినిమా వీక్షించేందుకు వచ్చిన వారు తమకు నచ్చిన కంపెనీ బాటిళ్లను కోనుగోలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. ఎమ్మార్పీతో పాటు నిర్దేశించిన పరిమాణం ప్యాకింగ్‌లపై ఉండాలని సూచించారు.

Related Stories: