రజనీ పొలిటికల్ ఎంట్రీపై అక్షయ్ కామెంట్..

చెన్నై: ఎన్నో ఏళ్లుగా ఏర్పడిన ఉత్కంఠకు తెరదించుతూ తమిళసూపర్‌స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై అభిమానులకు స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. తలైవా రాజకీయరంగ ప్రవేశాన్ని ఇప్పటికే పలువురు నటులు స్వాగతించారు. తాజాగా బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌ను రజనీ పొలిటికల్ ఎంట్రీపై మీడియా ప్రశ్నించింది. రాజకీయాల్లోకి వెళ్తున్న రజినీకి అంతా మంచే జరుగుతుందన్నాడు అక్షయ్. రజనీ మంచి రాజకీయ నేతగా ఎదుగుతారని..ఆయన రాజకీయాల్లో కూడా బాగా రాణిస్తారనే నమ్మకముందని విశ్వాసం వ్యక్తం చేశాడు అక్షయ్.
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?