2.0లో అక్షయ్ కుమార్ విలన్ కాద‌ట‌!

శంకర్ 2.0 మూవీపై ఏ వార్త వచ్చినా అది ఎక్కడలేని ఆసక్తి రేపుతున్నది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్ (రూ.450 కోట్లు)తో తెరకెక్కిన మూవీగానే కాదు.. 2010లో వచ్చిన రోబోకు సీక్వెల్‌గా కూడా 2.0 రిలీజ్‌కు ముందే సంచలనాలను రేపుతున్నది. పైగా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో మూవీ కావడం మరో ఆసక్తికరమైన అంశం. అయితే ఇన్నాళ్లూ ఈ మూవీలో అక్షయ్ కుమార్ ఓ విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడనే అందరికీ తెలుసు. కానీ తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో అక్షయ్ విలన్ కాదట. డాక్టర్ రిచర్డ్ క్యారెక్టర్‌ను అక్కీ పోషిస్తున్నాడని మూవీ వర్గాలు వెల్లడించాయి. 2.0లో అక్షయ్ విలన్ కాదు. అతని కాస్ట్యూమ్, ఇప్పటివరకు బయటకు వచ్చిన పోస్టర్లను బట్టి ఓ భయంకరమైన పాత్ర పోషిస్తున్న మాట నిజమే. అయితే అక్షయ్ పోషించే డాక్టర్ రిచర్డ్ పాత్ర మంచి కోసం ఫైట్ చేస్తుంటుంది. భూమిని నాశనం చేయడానికి వస్తున్న శక్తులకు వ్యతిరేకంగా అతను పోరాడుతాడు అని మూవీ వర్గాలు తెలిపాయి. సినిమాలో ఈ పాత్ర ఎప్పుడూ విలన్ కాదు అని స్పష్టంచేశాయి. గతంలో ఈ పాత్ర కోసం కమల్ హాసన్‌ను కూడా అనుకున్న విషయం తెలిసిందే. అక్షయ్ పేరు అనుకున్న తర్వాత ఈ పాత్ర గురించి ఉన్న కాస్త నెగటివిటీని కూడా చెరిపేసే ప్రయత్నం చేశాం. అతనికి నేషనల్ హీరోగా ఉన్న గుర్తింపు తెలిసిందే అని 2.0 మూవీ యూనిట్ తెలిపింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా జనవరి 25న విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మధ్యే దుబాయ్‌లో కళ్లు చెదిరే రీతిలో ఆడియో రిలీజ్ వేడుక జరిగిన విషయం తెలిసిందే.
× RELATED ఆ ముగ్గురు హీరోలు ఒకే ఫ్రేములో..