క్రేజీ కాంబినేష‌న్ సెట్ చేసిన క‌ర‌ణ్ జోహార్

ఖిలాడీ కుమార్ అక్ష‌య్‌, గ్లామ‌ర్ డాల్ క‌రీనా క‌పూర్ ఖాన్ కాంబినేష‌న్ అంటేనే జ‌నాల‌లో ఓ రేంజ్ అంచ‌నాలు నెల‌కొని ఉంటాయి. 2015లో గ‌బ్బ‌ర్ ఈజ్ బ్యాక్ అనే చిత్రంతో ఆడియ‌న్స్‌ని మెస్మ‌రైజ్ చేసింది ఈ జంట‌. ప్ర‌స్తుతం వారిద్దరి కాంబినేష‌న్‌లో క‌ర‌ణ్ జోహార్ గుడ్ న్యూస్ అనే చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌టన చేశాడు. గుడ్ న్యూస్ అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి రాజ్ మెహ‌తా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నుండ‌గా, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ కో ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. దిల్జిత్‌ద దోసంగ్ మ‌రియు కైరా అద్వానీ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించ‌నున్నారు. 2019 జూలై 19న మూవీని విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేశారు మేక‌ర్స్‌. మంచి మెసేజ్‌తో పాటు ఎంట‌ర్‌టైనింగ్‌గా ఈ చిత్రం ఉంటుంద‌ని తెలుస్తుంది. క‌రీనా చివ‌రిగా వీరే ది వెడ్డింగ్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక అక్ష‌య్ న‌టించిన గోల్డ్ చిత్రంతో పాటు ప్ర‌తినాయ‌కుడిగా న‌టించిన రోబో 2 త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్నాయి.

Related Stories: