మెగాస్టార్ పాత్ర‌లో అజిత్ ..!

త‌ల అజిత్ కోలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రు. విభిన్న పాత్ర‌లతో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న అజిత్ ప్ర‌స్తుతం విశ్వాసం అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. శివ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతుంది. సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ మూవీ త‌ర్వాత అజిత్ పింక్ రీమేక్ లో న‌టించ‌నున్నాడని తెలుస్తుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, గ్లామ‌ర్ బ్యూటీ తాప్సీ న‌టించిన పింక్ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొంద‌డ‌మే కాక ప‌లు అవార్డుల‌ని సాధించింది. ఈ చిత్రాన్ని బోని క‌పూర్ త‌మిళంలో రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. హిందీ పింక్‌లో న్యాయ‌వాదిగా క‌నిపించిన బిగ్ బీ పాత్ర‌లో అజిత్ అయితే బాగుంటాడని భావించిన టీం ఆయ‌న‌ని సంప్ర‌దించార‌ట‌. ఇందుకు అజిత్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌నేది తాజా వార్త‌.

వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న ముగ్గురు యువతులను రక్షించే న్యాయవాది ఇతివృత్తంగా తెరకెక్కిన చిత్రం పింక్‌. ఈ చిత్రాన్ని ధీర‌న్ అధికారం ఒండ్రు చిత్ర ఫేం వినోద్ త‌మిళంలో రీమేక్ చేయ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం రీమేక్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్క్రిప్ట్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా , ఈ చిత్ర షూటింగ్‌ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. తాప్సీ పాత్ర కోసం ఏ హీరోయిన్‌ని ఎంపిక చేస్తారో తెలియాల్సి ఉంది.

Related Stories: