వాజ్‌పేయిని గుర్తుచేసుకున్న ఐశ్వర్యరాయ్

హైదరాబాద్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతి పట్ల ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు నివాళి అర్పించారు. తాజాగా బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్‌బచ్చన్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వాజ్‌పేయిని గుర్తు చేశారు. 2000 సంవత్సరంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో.. బాలీవుడ్ స్టార్స్ శ్రీదేవి, ఐశ్వర్యలు ఆయన్ను కలిశారు. ఆ ఫోటోలను ఇప్పుడు ఐశ్వర్యరాయ్ పోస్ట్ చేసింది. వాజ్‌పేయిని ఎంతో గౌరవిస్తున్నట్లు, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఐశ్వర్య తన పోస్టులో తెలిపింది. వైట్ సల్వార్‌లో శ్రీదేవి, గ్రీన్ సారీలో ఐశ్వర్యరాయ్ .. ఆ ఫోటోలో దర్శనమిచారు. వాజ్‌పేయితో ఇద్దరూ నవ్వుతూ కనిపించారు.

✨🙏Respect 🙏✨Rest In Peace🙏✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

× RELATED ఒంటిపై కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్య