బెంగళూరులోనే వచ్చే ఏడాది ఎయిర్ షో

న్యూఢిల్లీ: ఏటా బెంగళూరులో నిర్వహించే విమాన ప్రదర్శనలో ఏ మార్పు ఉండబోదని రక్షణ శాఖ శనివారం తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 20-24 మ ధ్య బెంగళూరులోనే విమాన ప్రదర్శన నిర్వహిస్తామన్నది. లక్నోలో ఎయిరో ఇండియా-2019 ప్రదర్శన ను నిర్వహించాలని గత నెల 11న రక్షణ మంత్రిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కోరారు. దీనిపై కర్ణాటకలోని అన్ని పార్టీలు మండిపడ్డాయి. బెంగళూరు లోనే విమాన ప్రదర్శన చేపట్టాలని ప్రధాని మోదీకి కర్ణాటక సీఎం కుమారస్వామి రాసిన లేఖలో కోరారు.