బుల్లెట్ రైలు లోగో చిరుత

చిరుత వేగానికి నిదర్శనం. దీని చిత్రాన్ని లోగోగా ఉపయోగించాలంటే దాని వేగం కూడా అలాగే ఉండాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విద్యార్థి రూపొందించిన చిరుత పరుగు చిత్రాన్ని బుల్లెట్ రైలు లోగాగా అధికారులు ఎంపిక చేశారు. బుల్లెట్ రైలు లోగో రూపకల్పన కోసం దరఖాస్తులు ఆహ్వానించగా దాదాపు వందకుపైగా వచ్చాయి. వాటిలో నుంచి ఈ లోగోను ఎంపిక చేశారు. నీలం, ఎరుపు రంగులో ఉన్న ఈ లోగో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఔట్ లైన్ గా చిరుత పరుగుగా అగుపిస్తూ ఇన్ సైడ్ లో లోకోమోటీవ్ ఇంజిన్ అమరి ఉండటం లోగో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అహ్మదాబాద్ - ముంబై మధ్య నడిచే ఈ బుల్లెట్ రైలు సర్వీసులు 2022 ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి రానున్నాయి.

Related Stories: