రూపాయి మళ్లీ మునక

ముంబై, సెప్టెంబర్ 24: డాలర్‌తో రూపాయి మారకం విలువ మళ్లీ పతనం అయిం ది. తాజాగా మరో 43 పైసలు తగ్గి రూ. 72.63 వద్ద ముగిసింది. ఇరాన్‌పై అమెరికా అం క్షల అమలు దగ్గరపడుతుండడంతో క్రూడాయిల్ ధరల్లో భారీ పెరుగుదల కరెన్సీ మా ర్కెట్‌లో ఒడిదుడుకులు పెరిగాయి. గత వారం వచ్చిన రికవరీ కేవలం రెండు రోజులకే పరిమితం అయింది. గత వారంతంలో రూ. 72.20 వద్ద ముగిసిన రూపాయి మారకం రూ. 72.47 వద్ద ప్రారంభం అయింది. ఒకదశలో రూ. 72.73 వరకూ పతనం అయి చివరికి రూ. 72.63 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు నాలుగేండ్ల గరిష్ఠ స్థాయికి చేరుకోవడం, చైనా అమెరికాతో వాణిజ్య చర్చలను రద్దు చేసుకోవడం పాటు అనేక అంతర్జాతీయ పరిణామాలు కరెన్సీ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసాయి.

ఇరాన్ చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు దగ్గరపడుతుండడం ఉత్పత్తిని పెంచకుండా ఉండేందుకే ఒపెక్ దేశాలు సిద్ధపడుతున్నాయన్న వార్తలు కరెన్సీల పతనానికి దారితీసాయి. గత వారం చివరి రెండు రోజుల్లో 78 పైసలు కోలుకున్న రూపాయి ఈ వార్తలతో 43 పైసలు నష్టపోయింది. డాలర్లకు నెలాఖరు డిమాండ్ పెరిగిందని కరెన్సీ మార్కెట్ డీలర్లు తెలిపారు. క్రూడాయిల్ పెరుగుదల వల్ల కరెంట్ ఖాతా పెరిగిపో ఆర్థికవ్యవస్థ వృద్ధిపై ప్రభావం చూపుతుందన్న అంచనాలు రూపాయి మరింత పతనం కావడానికి దోహదపడవచ్చునని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇప్పటికే టర్కీ, అర్జెంటీనా దేశాల కరెన్సీలు కూడా భారీగా నష్టపోతున్నాయి.