ఏఈఈ పోస్టుల భర్తీకి 29న ఇంటర్వ్యూలు

హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఏఈఈ పోస్టుల భర్తీలో భాగంగా మూడోవిడుత ఇంటర్వ్యూలు ఈ నెల 29న నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. తమ కార్యాలయంలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు సంబంధించిన జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరిచినట్టు పేర్కొన్నది.

వివిధ పరీక్షల ప్రాథమిక కీ విడుదల..

వివిధ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని విడుదల చేసినట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఫిజియోథెరపిస్ట్, రేడియోగ్రాఫర్, పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్, రీఫ్రాక్షనిస్ట్, హెల్త్ సూపర్‌వైజర్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పరీక్షల ప్రాథమిక కీని టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నది. వీటిపై ఈ నెల 29 నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్టు తెలిపింది.

అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్ భర్తీకి అభ్యర్థుల జాబితా..

ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ విభాగంలోని అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్ కొలువుల భర్తీకి ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. తమ వెబ్‌సైట్లో జాబితాను అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నది.
× RELATED 'పంచాయతీ'ఎన్నికల పోలింగ్ ప్రారంభం