టీఆర్‌ఎస్‌కే అడ్వకేట్స్ సంపూర్ణ మద్దతు

మాజీ స్పీకర్ గెలుపు కోసం ప్రచారం బార్‌కౌన్సిల్ రాష్ట్ర సభ్యుడు జయకర్ జయశంకర్ భూపాలపల్లి: ప్రజా సమస్యలను గుర్తించి, ప్రజామోద పాలన సాగించిన టీఆర్‌ఎస్ పార్టీకి న్యాయవాదుల సంపూర్ణ మద్దతు ఉంటుందని రాష్ట్ర బార్‌కౌన్సిల్ సభ్యుడు బైరుపాక జయకర్ అన్నారు. ఇవాళ రేగొండ మండల కేంద్రంలో న్యాయవాదులు స్థానిక టీఆర్‌ఎస్ నాయకులను కలిసి మాజీ స్పీకర్‌ మధుసూదనాచారికి మద్దతు ప్రకటించారు. అనంతరం రేగొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో జయకర్ మాట్లాడతూ.. నాడు తెలంగాణ సాధన కోసం పోరాడి, నేడు అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న టీఆర్‌ఎస్ పార్టీకి న్యాయవాదుల సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తామన్నారు. భూపాలపల్లిలో మాజీ స్పీకర్ గెలుపు కోసం తమవంతుగా ప్రచారం నిర్వహిస్తామన్నారు. మధుసూదనాచారి రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నా, అంతులేని అభివృద్ధి చేశారని అన్నారు. అలాంటి నాయకుడిని తిరిగి గెలిపిస్తేనే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బండి మొగిలి, గూనిగంటి శ్రీనివాస్, రమేశ్, పీ శ్రీనివాస్, సుధాకర్, కృష్ణ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మోడెం ఉమేశ్‌గౌడ్, ఈర్ల సదానదం, మటిక సంతోష్, సుదర్శన్, శేఖర్, గండి తిరుపతి పాల్గొన్నారు.

Related Stories: