ముందస్తు కుట్ర ప్రకారమే భీమా-కోరెగావ్ అల్లర్లు

పుణె: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా-కోరెగావ్ అల్లర్లు అప్పటికప్పుడు జరిగినవి కావని, ముందస్తు కుట్ర ప్రకారమే ఈ అల్లర్లు జరిగాయని పుణె డిప్యూటీ మేయర్ సిదార్థ్ దెండె ఆధ్వర్యంలోని నిజ నిర్ధారణ కమిటీ తేల్చింది. ఈ అల్లర్లకు కుట్ర పన్నిన వారిలో ఎక్బొటె, బిడె ప్రధాన నిందితులని తెలిపింది. ఈ మేరకు కమిటీ తన నివేదికను మంగళవారం పుణె రూరల్ పోలీసులకు అందజేసింది. సిదార్థ్ దెండె మాట్లాడుతూ అల్లర్లు సృష్టించి ఘర్షణలు జరుగడానికి ప్రణాళికలు రచించిన నిందితులు ముందస్తుగా రాళ్లను, కర్రలను కూడా ఘటనా స్థలంలో ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు.

Related Stories: