హాయ్‌.. నా పేరు బంటి

క్రియేటివ్ డైరెక్ట‌ర్ ర‌విబాబు కాస్త డిఫరెంట్ గా ఆలోచించి పంది పిల్లపై అదుగో అనే పేరుతో సినిమా తీస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైన గ్రాఫిక్స్ వ‌ర్క్ వ‌ల‌న సినిమా రిలీజ్‌కి చాలా టైం ప‌డుతుంది. అయితే ఆ మ‌ధ్య ప‌లు సంద‌ర్భాల‌లో పందిపిల్ల‌తోనే బ‌య‌ట క‌నిపించిన ర‌విబాబు, ఇటీవ‌ల పంది పిల్ల పళ్లుతోముతూ కనిపించారు. ఆ త‌ర్వాత పందిపిల్లను వీపుపై కూర్చోబెట్టుకుని పుషప్స్ చేస్తున్న వీడియో విడుద‌ల చేశాడు. ఫిట్‌నెస్ కోసం బంటి కూడా వ్యాయామం చేస్తోందని, మరి మీరెందుకు చేయరని ప్రశ్నించాడు. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. `హాయ్‌.. మై నేమ్ ఈజ్ బంటీ` అంటూ పందిపిల్ల ఫోటోతో విడుద‌లైన ఈ పోస్ట‌ర్ అల‌రిస్తుంది. ద‌స‌రా కానుక‌గా ఈ మూవీని విడుద‌ల చేయాల‌ని ర‌విబాబు భావిస్తున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న కూడా చేయ‌నున్నాడ‌ని తెలుస్తుంది. రవిబాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అభిషేక్, నాభ లు చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి నిర్మాత సురేష్ బాబు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. లైవ్ యాక్ష‌న్ త్రీడీ సాంకేతిక‌తో తెర‌కెక్కిన ఈ సినిమా తెలుగుతోపాటు ప‌లు భాష‌ల్లో విడుద‌ల కానుంది. ప్ర‌శాంంత్ విహారీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు, సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు.

Related Stories: