పవర్ ఆఫ్ పీపుల్

శివ, సోనా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం రూల్. ది పవర్ ఆఫ్ పీపుల్ ఉపశీర్షిక. పైడి రమేష్ దర్శకుడు. పైడి సూర్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ నెల 23న విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ ఆవేశం కంటే ఆలోచన, డబ్బు కంటే మానవీయ విలువల ముఖ్యమని చాటిచెప్పే చిత్రమిది. సామాజిక ఇతివృత్తానికి అర్థవంతమైన సందేశాన్ని మేళవించి రూపొందించాం అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ఓ యువజన నాయకుడి కథ ఇది. నిరుపేదలకు జరుగుతున్న అన్యాయాలపై అతడు ఎలాంటి పోరాటాన్ని సాగించాడన్నదే చిత్ర ఇతివృత్తం అని అన్నారు. ప్రజలకు ఉపయుక్తమైన మంచి చిత్రమిదని కథానాయకుడు శివ చెప్పారు. మురళీధర్‌గౌడ్, కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు చిత్ర తారాగణం.