నితిన్ - రష్మిక మందన్నల భీష్మ మొదలైంది

నితిన్, రష్మిక మందన్న జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న తాజా చిత్రం భీష్మ. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకుడు. బుధవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకుడు వెంకీ కుడుముల చిత్ర విశేషాలు తెలియజేస్తూ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. యువతరాన్ని ప్రతిబింబిస్తూ నితిన్, రష్మిక మందన్న పాత్రలు సాగుతాయి. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి. కథ, కథనాలు అలరిస్తాయి అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పారు. నరేష్, సంపత్, రఘుబాబు, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, కల్యాణి, రాజశ్రీనాయర్ కీలక పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్, ఎడిటర్: నవీన్ నూలి, సమర్పణ: పి.డి.వి ప్రసాద్.

Related Stories: