థియేటర్ లో అవమానం.. బోరున ఏడ్చిన హరితేజ

బిగ్ బాస్ తో ఫుల్ పాపులర్ అయిన ఆర్టిస్ట్ హరితేజ. సినిమాలలోను సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ మరో వైపు యాంకర్ గాను రాణిస్తుంది హరితేజ. అయితే ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న హరితేజ రీసెంట్ గా మహానటి మూవీకి వెళ్లింది. బిజీగా ఉండడం వలన వీలు చూసుకొని తన ఫ్యామిలీతో కలిసి థియేటర్ కి వెళ్లింది . ఫస్ట్ హాఫ్ లో తన చెల్లి పక్కన కూర్చొని సినిమా చూసిన హరితేజ, సెకండాఫ్ లో తన తల్లి పక్కన కూర్చోవాలనుకుంది. ఈ క్రమంలో తన తండ్రిని పక్క సీటుకి వెళ్ళమని కోరగా, ఆ పక్కనే ఉన్న మహిళ అతని పక్కన మా అమ్మాయి కూర్చోదని అభ్యంతరం వ్యక్తం చేసిందట. అంతేకాదు మీ సినిమా వాళ్ళలా మేము అందరి పక్కన కూర్చోలేమంటూ చులకనగా మాట్లాడిందట. ఈ విషయాన్ని లైవ్ వీడియో ద్వారా చెబుతూ కన్నీటి పర్యంతమైంది హరితేజ. వీడియోలో తేజ చెప్పిన విషయాలపై మీరు ఓ లుక్కేయండి.

Related Stories: