20 ఏండ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగాలి: నటుడు ఉత్తేజ్

బంజారాహిల్స్ : ఎన్నికల సమయంలో వచ్చి పబ్బం గడుపుకునే మాటలు చెప్పేవారిని నమ్మవద్దని ప్రముఖ సినీ నటుడు ప్రజలకు సూచించారు. నాలుగేండ్లలో తెలంగాణ రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధిని చేసి చూపించిన కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉత్తేజ్ అభిప్రాయపడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌కు మద్దతుగా శ్రీనగర్‌కాలనీలో ఉత్తేజ్ ఇవాళ ప్రచారం నిర్వహించారు. మాగంటి గోపీనాథ్ తోపాటు ఇంటింటికి వెళ్లి టీఆర్‌ఎస్ పార్టీకే ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఉత్తేజ్ మాట్లాడుతూ..ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.

సీఎం కేసీఆర్ అందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి రాష్ట్రాన్ని సాధించారన్నారు. కేవలం రాష్ట్ర సాధనతోనే లక్ష్యం నెరవేరలేదని, రాష్ట్ర్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ముఖ్యమని నమ్మిన కేసీఆర్ నాలుగున్నర ఏళ్లలోనే అనేక అభివృద్ది పనులు చేపట్టారని ఉత్తేజ్ స్పస్టం చేశారు. మంచినీటి సమస్య, కరెంట్ సమస్యలను పరిష్కరించారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ ప్రాజెక్టులను ప్రారంభించి వాటిని పూర్తిచేస్తుండడం సాధారణ విషయం కాదన్నారు. గతంలో సొంతూరికి వెళ్లాలంటే ఇబ్బందులు పడేవారిమని, ఊరికివెళ్తే ఉక్కపోతతో కష్టపడడం ఎందుకని ఊరికి వెళ్లేవాళ్లం కాదని, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారాయని అన్నారు. రెండేళ్లుగా పల్లెటూళ్లలో కూడా 24 గంటల పాటు కరెంట్ ఉంటోంది. దాంతో సొంతూరికి వెళ్లి నాలుగైదు రోజులు ఉండి వస్తున్నామంటే అదంతా కేసీఆర్ చలవే అన్న విషయం అందరికీ తెలుసున్నారు. ఇలాంటి అభివృద్ధితో పాటు పేదలకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ,ఆసరా పించన్లతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు.

తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం మారకుండా 20 ఏండ్ల పాటు కొనసాగాలని, ఓటర్లంతా ఆలోచించి మరోసారి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ఉత్తేజ్ కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సినీ ఇండస్ట్రీకి చెందిన ఓటర్లు అధికసంఖ్యలో ఉన్నారని, వారంతా మాగంటి గోపీనాథ్‌కు మద్దతు పలికేందుకు సిద్దంగా ఉన్నారన్నారు.

Related Stories: