రాష్ట్రప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఆచార్య అలేఖ్య ఎంపిక

తెలుగుయూనివర్సిటీ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లలిత కళా పీఠం అధిపతి, వర్సిటీ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న అలేఖ్యను విశ్వవిద్యాలయం స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ప్రకటించింది. 30 ఏండ్లుగా తెలుగువర్సిటీ నృత్యశాఖలో అధ్యాపకులుగా పనిచేస్తూ అనేక మంది విద్యార్థులను అంతర్జాతీయ స్థాయి కళాకారులుగా తీర్చిదిద్దుతున్న అలేఖ్యను ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆచార్య అలేఖ్య నేడు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

Related Stories: