ఏసీబీకి చిక్కిన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్‌కు శిక్ష ఖరారు!

కరీంనగర్: 2011 ఏప్రిల్ 15న లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖ అధికారులకు చిక్కిన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లకు శిక్ష ఖరారైంది. ఎస్సై ఎం రమేశ్, కానిస్టేబుళ్లు బి. ఎల్లయ్య, కె.శ్రీనివాస్‌కు కరీంనగర్ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఎస్సై రమేశ్, కానిస్టేబుల్ ఎల్లయ్యకు ఏడాది శిక్ష, రూ.10వేల జరిమానా విధించారు. మరో కానిస్టేబుల్ కె. శ్రీనివాస్‌కు 6 నెలల జైలు శిక్ష రూ.2500 జరిమానా విధించారు.

Related Stories: