అర్హులు కాని వారికి అంద‌మైన భార్య‌లా: నెటిజ‌న్‌ ట్వీట్

సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీల‌ని ఉద్దేశించి కొంద‌రు నెటిజ‌న్స్ చేసే ట్వీట్స్ వారి ఆగ్ర‌హాన్ని క‌ట్ట‌లు తెంచేలా చేస్తున్నాయి. కొంద‌రు ఆ ట్వీట్స్‌కి కూల్‌గా స్పందిస్తుంటే మ‌రి కొంద‌రు నెటిజ‌న్స్ స్టైల్‌లో ఏకి పారేస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అభిషేక్ బ‌చ్చ‌న్‌, క్రికెట‌ర్ స్టూవ‌ర్ట్ బిన్నీల‌ని ఉద్దేశించి ఓ అభిమాని త‌న ట్విట్ట‌ర్‌లో అర్హులు కాని వారికి అంద‌మైన భార్య‌లు దొరికారు. త‌ల్లితండ్రుల పాపులారిటీని వాడుకొని ఒక‌రు సినిమాలు మ‌రొక‌రు క్రికెట్‌లోకి వ‌చ్చారు. ఇది మీకు నిజ‌మ‌ని అనిపిస్తే రీ ట్వీట్ చేయండి అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ అభిషేక్ బ‌చ్చ‌న్‌కి కూడా చేర‌డంతో త‌న‌దైన స్టైల్‌లో జ‌వాబిచ్చాడు.

నువ్వు నా స్థానంలో ఉండి ఓ మైలు ప్ర‌యాణించి చూడు. ప‌ది అడుగులు న‌డ‌వ‌గ‌లిగినా నేను సంతోషిస్తాను బ్ర‌ద‌ర్‌. నీ ట్వీట్‌ని చూస్తుంటే నువ్వు నాలా ప్ర‌యాణించ‌లేవ‌ని అర్ధ‌మవుతుంది. స‌మ‌యం వెచ్చించి నాలా ఎదిగేందుకు ప్ర‌య‌త్నించు. ఇత‌రుల గురించి ఆలోచించ‌డం మానేయి. ఎవ‌రి ప్ర‌యాణం వారిది అనేది ఆ దేవుడికి తెలుసు. గెట్ వెల్ సూన్ అంటూ నెటిజన్‌కి స్మూత్‌గా రిప్లై ఇచ్చాడు. దీంతో ఖంగు తిన్న నెటిజ‌న్.. అభి నేను ఏదో స‌ర‌దాగా అన్నాను. నువ్వు చాలా కూల్ మనిషివి. థియేట‌ర్‌లో నీ సినిమా ఆడ‌క‌పోయిన సూట్‌లో నిన్ను చూస్తే నేను ఫిదా అవుతాను. నేను స‌ర‌దాగా జోక్ చేశాను. నువ్వు ఫీల్ అయితే క్ష‌మించు. అమితాబ్ కుమారుడివైన నీపైన‌, స‌చిన్ తెందూల్క‌ర్ కుమారుడైన అర్జున్ పై ఎంత ప్రెషర్ ఉంటుందో నేను అర్ధం చేసుకోగ‌ల‌ను. నన్ను క్ష‌మించు అని నెటిజ‌న్ అభిషేక్‌కి రిప్లై ఇచ్చాడు స‌ద‌రు నెటిజ‌న్ .

గతంలోనూ అభిషేక్‌కి ఓ నెటిజ‌న్ నుండి ఇలాంటి చేదు అనుభవం ఒక‌టి ఎదురు కాగా, ఆయ‌న మ‌రో మాట మాట్లాడ‌కుండా స్ట‌న్నింగ్ రిప్లై ఇచ్చాడు. పెళ్ల‌య్యాక కూడా ఇంకా భార్య పిల్ల‌ల‌తో క‌లిసి త‌ల్లితండ్రుల వ‌ద్దే ఉంటావా అని నెటిజ‌న్ అభిషేక్‌కి ట్వీట్ చేయ‌గా, దానికి స్పందించిన అభిషేక్.. ఒక‌ప్ప‌డు వారు నాకు తోడుగా ఉన్న‌ట్టు నేను ఇప్పుడు వారికి తోడుగా ఉంటున్నాను. ఇందుకు చాలా గ‌ర్విస్తున్నాను. మీరు కూడా మీ త‌ల్లితండ్రుల‌తో క‌లిసి ఉండేందుకు ట్రై చేయండి అంటూ నెటిజ‌న్‌కి అభి గట్టి షాక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

Related Stories: