తండ్రికి స్పెష‌ల్ నోట్ రాసిన ఆరాధ్య‌

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ముద్దుల కూతురు ఆరాధ్య ఎంత ఫేమ‌స్సో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పార్టీల‌లో, ప‌లు ఈవెంట్స్‌లో త‌ల్లిదండ్రుల‌తో మెరిసే ఈ చిన్నారి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది. నవంబ‌ర్ 16, 2011న జ‌న్మించిన ఆరాధ్య గ‌త ఏడాది త‌న ఆరో బ‌ర్త్‌డే వేడుక జ‌రుపుకుంది. అయితే ఈ పాప రీసెంట్‌గా త‌న తండ్రికి స్పెషల్ నోట్ రాసింది. దీనిని అభిషేక్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌డంతో వైర‌ల్ అయింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకున్న అభిషేక్ బ‌చ్చ‌న్ రెండేళ్ళు వెండితెర‌కు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే . కొన్నాళ్ళ పాటు సినిమాల‌కి దూరంగా ఉండి బిజినెస్‌ల‌పై దృష్టి పెట్టిన అభిషేక్ .. అనురాగ్ క‌శ్య‌ప్ ద‌ర్శ‌క‌త్వంలో ‘మన్‌మర్జాయన్‌’ అనే ప్రాజెక్ట్ చేశాడు . ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్కీ కౌశాల్‌, తాప్సీ ప‌న్ను ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఇటీవ‌లే చిత్ర షూటింగ్ పూర్తైంది. త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. అయితే సినిమా కోసం రెండు నెల‌ల పాటు ఆఫీసుకి దూరంగా ఉన్నాడు అభిషేక్. షూటింగ్ పూర్తైన త‌ర్వాత మ‌ళ్లీ త‌న ఆఫీసుకి రీ ఎంట్రీ ఇస్తున్న‌నేప‌థ్యంలో ఆయ‌న కూతురు ఆరాధ్య ల‌వ్ యూ ప‌ప్పా అనే స్టిక్కి నోట్‌ని ఆఫీసులో ఉంచింది. ఇది చూసి మురిసిపోయిన అభిషేక్ త‌న ఆనందాన్ని నెటిజ‌న్స్‌తో షేర్ చేసుకున్నాడు.

Related Stories: