సైరాలో సుదీప్ లుక్ అవుట్..!

మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియ‌ర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న చిత్రం సైరా. భార‌త మాత‌కు బిగుసుకున్న సంకెళ్ళ‌ని తెంచ‌డానికి రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మించిన వ్య‌క్తి ఉయ్యాల వాడ న‌ర‌సింహ‌రెడ్డి. ఆ నాటి రోజుల‌లో బ్రిటీష్ సైనికుల‌తో అర్ధ‌రాత్రి, అప‌రాత్రి అనే తేడా లేకుండా యుద్ధం చేశాడు. ఇప్పుడు ఆయన జీవిత నేప‌థ్యంలో చిరు 151వ చిత్రంగా సురేంద‌ర్ రెడ్డి సైరా అనే మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల కానుంది. ఇటీవ‌ల చిరు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా టీజ‌ర్ విడుద‌ల కాగా, ఇది కొద్ది గంట‌ల‌లో రికార్డు వ్యూస్ సాధించి అందరికి షాక్ ఇచ్చింది. సైరా చిత్రంలో న‌య‌న‌తార‌, చిరంజీవి, అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తిబాబు , త‌మ‌న్నా, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. సుదీప్ అవుకు రాజు అనే పాత్ర‌లో క‌నిపించ‌నుండగా, ఆయ‌న బ‌ర్త్‌డే( సెప్టెంబ‌ర్ 2) సంద‌ర్భంగా మోష‌న్ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో గ్రాండియ‌ర్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు కిచ్చా సుదీప్. ఇక‌ బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బేన‌ర్‌పై రామ్ చ‌ర‌ణ్ సైరా చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా యాక్షన్‌ సీన్స్ కోసం స్కైఫాల్‌, హ్యారీ పొట‌ర్‌ల‌కి ప‌ని చేసిన హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్లు ప‌ని చేస్తున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్‌గా ర‌త్న‌వేలు ఉన్నారు.
× RELATED ఇంజిన్ రహిత రైలు ట్రైయిల్ రన్ విజయవంతం