‘అభిమన్యుడు’ డైరెక్టర్‌కు భారీ ఆఫర్

పీఎస్ మిత్రన్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తూ తీసిన ‘అభిమన్యుడు’ సినిమా బాక్సాపీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. విశాల్ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. తొలి సినిమాతోనే అగ్రనిర్మాతల చూపు తనవైపు తిప్పుకున్నాడు పీఎస్ మిత్రన్. ఈ డైరెక్టర్ తాజాగా భారీ ఆఫర్ అందుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

24 ఏఎం స్టూడియోస్ బ్యానర్‌పై హెచ్‌డీ రాజా నిర్మించనున్న సినిమాకు మిత్రన్ దర్శకత్వం వహించనున్నట్లు టాక్. శివకార్తీకేయన్ హీరోగా నటించనున్నాడు. శివకార్తీకేయన్ నటించిన ‘సీమరాజా’ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. సమంత, కీర్తిసురేశ్, సిమ్రన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తెలుగులో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు నిర్మాతలు.

Related Stories: