ఆమిర్‌ఖాన్ చేతిలో మహాభారతం పుస్త‌కం.. ఎందుకు?

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మహాభారతం ప్రాజెక్ట్‌పై గతంలో ఆసక్తి చూపిన విషయం తెలుసు కదా. అంతేకాదు అందులో తనకు కర్ణుడు లేదా కృష్ణుడి క్యారెక్టర్ పోషించాలని ఉందని కూడా చెప్పాడు. తాజాగా మరోసారి ఈ టాపిక్ తెరపైకి వచ్చింది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆమిర్‌ఖాన్ మహాభారతం బుక్కు పట్టుకొని కనిపించడం ఆసక్తి రేపుతున్నది. ఆమిర్‌ఖాన్ నిజంగానే మహాభారతం ప్రాజెక్ట్‌ను సీరియస్‌గా తీసుకుంటున్నాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి కూడా మహాభారతం ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపిన విషయం తెలిసిందే.

అతనితో కలిసి పనిచేయాలని తనకు కూడా ఉన్నదని ఆమిర్ అన్నాడు. ఏదో ఒకరోజు మహాభారతం చేయాలని ఉంది. అయితే ఇప్పటివరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. కనీసం అది ఊహించడానికి కూడా భయమేస్తున్నది. అదో పెద్ద కలగానే ఉంది. ఏదో ఒక రోజు చేస్తానేమో చూడాలి అని ఆమిర్ అన్నాడు. ఆమిర్‌ఖాన్ ప్రస్తుతం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా రిలీజ్ కోసం చూస్తున్నాడు. ఈ మూవీలో ఆమిర్‌తోపాటు అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ నటిస్తునారు.

× RELATED ఒంటిపై కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్య