ఆది పినిశెట్టి క్లాప్ షురూ

ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న ద్విభాషా చిత్రం క్లాప్.సౌండ్ ఆఫ్ సక్సెస్ ఉపశీర్షిక. పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాంక్ష సింగ్ కథానాయిక. బిగ్ ప్రింట్ పిక్చర్స్ అండ్ సర్వన్త్ రామ్ క్రియేషన్స్ పతాకంపై ఐబి కార్తికేయన్, యమ్. రాజశేఖర్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజాకార్యక్రమాల అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తెలుగు వెర్షన్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా క్లాప్ నిచ్చారు. తమిళ వెర్షన్‌కు హీరో నాని క్లాప్ నిచ్చారు. నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విఛాన్ చేశారు. స్క్రిప్ట్‌ను బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్ అందజేశారు. అనంతరం ఆది పినిశెట్టి మాట్లాడుతూ హృదయాన్ని కదిలించే చిత్రమిది. క్రీడా నేపథ్యంలో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. వాటన్నింటికి భిన్నంగా సాగుతుంది. భిన్నమైన రెండు పార్శాలున్న పాత్రలో నటిస్తున్నాను. ప్రతిభ వున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు అన్నారు. అథ్లెటిక్ స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే సినిమా ఇదని, ఏడాది కాలంగా ఈ చిత్ర కథని సిద్ధం చేసుకున్నానని దర్శకుడు తెలిపారు. జవ్వాజి రామాంజనేయులు మాట్లాడుతూ ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ నెల 17 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూర్, మధురైలలో జరిపే నాలుగు షెడ్యూళ్లతో చిత్రీకరణ పూర్తి చేస్తాం అన్నారు. నాజర్, ప్రకాష్‌రాజ్, క్రిష కురుప్, బ్రహ్మాజీ, ముండాసు పట్టి రాందాసుమిమే గోపి, సూర్య, మీనా, వాసు తదితరులు నటిస్తున్నారు.

Related Stories: