ఒకే కాన్పులో నలుగురు శిశువుల జననం

హైదరాబాద్: ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ చిలకలగూడలో చోటుచేసుకుంది. జన్మించిన వారిలో ఇద్దరు మగ, ఇద్దరు ఆడ శిశువులు ఉన్నారు. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు. నల్లకుంట బీబీసీ ఆస్పత్రికి చెందిన వైద్యులు మహిళకు శస్త్రచికిత్స చేశారు. శిశువులంతా ఏడో నెలలో జన్మించారు.
More in తాజా వార్తలు :