తెలుగు పద్యం చెప్పలేదని విద్యార్థినిని కొట్టిన టీచర్

హైదరాబాద్ : తెలుగు పద్యం చెప్పలేదని విద్యార్థినిని ఓ టీచర్ కొట్టాడు. ఈ సంఘటన ఉప్పల్ చిలుకానగర్‌లోని కృష్ణవేణి పాఠశాలలో ఇవాళ చోటు చేసుకుంది. తరగతి గదిలో పాఠం చెబుతున్న ఉపాధ్యాయుడు.. ఓ విద్యార్థినిని నిల్చోబెట్టి తెలుగు పద్యం చెప్పాలని ప్రశ్నించాడు. విద్యార్థినిని తెలుగు పద్యం చెప్పకపోవడంతో.. ఆ చిన్నారిపై చేయి చేసుకున్నాడు. చెంపలకేసి కొట్టాడు. వీపుపై బాదడంతో ఎర్రగా కమిలిపోయింది. ఈ సంఘటన అంతా అక్కడున్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయింది. అయితే బాధిత విద్యార్థినిని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విద్యార్థినిని కొట్టిన టీచర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
× RELATED తమ్ముడి ప్రేమవివాహం.. అన్నపై హత్యాయత్నం