సోదరిపై లైంగికదాడి యత్నం.. నిందితుడికి ఐదేండ్ల జైలు

హైదరాబాద్ : సోదరిపై లైంగికదాడి యత్నానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా.. ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,500ల అపరాధ రుసుమును న్యాయమూర్తి విధించారు. షాహినాయత్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ రవీందర్‌రెడ్డి కథనం ప్రకారం.. జుమ్మెరాత్‌బజార్‌కు చెందిన ఖాలీద్(25) తన తల్లి, సోదరితో కలిసి నివాసముంటున్నాడు. ఇదిలా ఉండగా.. ఖాలీద్ తన సోదరి(17)పై లైంగికదాడికి పలుమార్లు యత్నించాడు. అతనికి ఎంత చెప్పినా వినకపోవడంతో సోదరి షాహినాయత్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయడంతో పీపీ ప్రతాప్‌రెడ్డి కేసును వాదించగా అదనపు మొదటి ఎఎంఎస్‌జే కోర్టు న్యాయమూర్తి సునీత కుంచల.. ఖాలీద్‌కు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2500ల అపరాధ రుసుం విధించారు. ఈ కేసును ఎస్‌ఐ నరేందర్ దర్యాప్తు చేస్తున్నారు.

Related Stories: